ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.58
సూర్యాస్తమయం: సాయంత్రం.6.46
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.9.00 మ12.00 ల2.00 ల3.30
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:
ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య:
ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
తుల:
ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి
ధనుస్సు:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ స్నేహితుల వలన ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మకరం:
ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి ఆదాయాన్ని పొందుతారు.కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కుంభం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు ప్రారంభించిన పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.వ్యవసాయ పరంగా ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు.
ఇతరుల సహాయం మీకెప్పుడు ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఈరోజు మీరు సంతానం పట్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.అవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు
.