ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలోని పాచిల్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్ల అవతారమెత్తి పరిసరాలను శుభ్రం చేస్తున్న దృశ్యాలు తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేశాయి.గత ప్రభుత్వాల పాలనలో ప్రతి స్కూల్లో స్వీపర్లు ఉండేవారు.

 Students Are Sweepers In Govt School, Students ,sweepers ,govt School, Yadadri B-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వీపర్ల వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామపంచాయతీ సిబ్బందిని పాఠశాలలను శుభ్రపరచడానికి వాడుకుంటున్నారు.కానీ, గ్రామపంచాయతీ సిబ్బంది ఊరి పారిశుద్ధ్య పనులు ఉండడం,ప్రస్తుతం వారు సమ్మెలో ఉండడంతో స్కూళ్లను శుభ్రం చేసే వారు లేక విద్యార్థులే శుభ్రం చేసుకునే దుస్థితి ఏర్పడిందని అంటున్నారు.

భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడే పాఠశాలల్లో విద్యార్థులు బాలకార్మికులుగా మారడం బాధాకరం.ఇప్పటికే మండలంలో చాలా స్కూళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు సతమతమవుతుంటే, స్కూళ్లను బాగు చేసుకునే బాధ్యత కూడా విద్యార్థులే తీసుకోవడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా తయారైందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube