ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు…!

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలోని పాచిల్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్ల అవతారమెత్తి పరిసరాలను శుభ్రం చేస్తున్న దృశ్యాలు తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేశాయి.

గత ప్రభుత్వాల పాలనలో ప్రతి స్కూల్లో స్వీపర్లు ఉండేవారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వీపర్ల వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామపంచాయతీ సిబ్బందిని పాఠశాలలను శుభ్రపరచడానికి వాడుకుంటున్నారు.

కానీ, గ్రామపంచాయతీ సిబ్బంది ఊరి పారిశుద్ధ్య పనులు ఉండడం,ప్రస్తుతం వారు సమ్మెలో ఉండడంతో స్కూళ్లను శుభ్రం చేసే వారు లేక విద్యార్థులే శుభ్రం చేసుకునే దుస్థితి ఏర్పడిందని అంటున్నారు.

భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడే పాఠశాలల్లో విద్యార్థులు బాలకార్మికులుగా మారడం బాధాకరం.ఇప్పటికే మండలంలో చాలా స్కూళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు సతమతమవుతుంటే, స్కూళ్లను బాగు చేసుకునే బాధ్యత కూడా విద్యార్థులే తీసుకోవడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా తయారైందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయంలో మహేష్ నమ్రతలతో పోల్చి చూస్తే సితార టాప్.. అసలేం జరిగిందంటే?