బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విష్ణు ప్రియ(Vishnu Priya) ఈమధ్య కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే ఈమె పాల్గొని సందడి చేస్తున్నారు.
ఇక ఈమె ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ చేయడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విష్ణు ప్రియ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మామూలుగా ఉండదని చెప్పాలి.
నిత్యం హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోషూట్లు చేయించుకోవడం ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం చేస్తుంటారు.ఇలా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో నిత్యం ఎంతో హడావిడి చేసే విష్ణుప్రియ ఉన్నఫలంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో అందరిని కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) బాటలోనే ఈమె కూడా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
తాజాగా విష్ణు ప్రియ వారణాసి (Varanasi) వెళ్లినట్టు తెలుస్తుంది ఈ ఫోటోలో ఈమె వైట్ చుడిదార్ ధరించి మెడలో పూలమాల వేసుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.అయితే ఈమె ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసమే వారణాసి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేశారని తెలుస్తోంది.
ఇలా ఉన్నఫలంగా విష్ణు ప్రియ ఆధ్యాత్మికతవైపు యూటర్న్ తీసుకోవడంతో ఇంత సడన్ గా ఈ మార్పు ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత కూడా ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ తన ఆరోగ్యం పై దృష్టి పెట్టిన సంగతి మనకు తెలిసిందే.