వైసీపీ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కావాలనే విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.చంద్రబాబు ఇచ్చే తప్పుడు లెక్కలతో విషం చిమ్ముతున్నారన్నారు.
నోటికి హద్దు లేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పవన్ మాటల్లో చంద్రబాబుపై ప్రేమ కనిపించిందని చెప్పారు.
సచివాలయ వ్యవస్థ అంటే పవన్, చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు.జగన్ ను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి అందిస్తున్నారన్న ఆయన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.జగన్ కు వాలంటీర్లు మంచి పేరు తెస్తున్నారని ఓర్చుకోలేకపోతున్నారని వెల్లడించారు.