హీరో సుమంత్ అక్కినేని( Sumanth Akkineni ) వరుసుడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన కి మొదటి నుంచే చాలా ఎదురుదెబ్బలు తగిలాయనే చెప్పాలి.ఎందుకంటే ఈయన చేసిన చాలా సినిమాలు ప్లాప్ లుగా మిగిలాయి మొదట్లో ఈయన చేసిన సినిమాల్లో యువకుడు, సత్యం లాంటి సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి నిజానికి సుమంత్ మంచి హైట్, వెయిట్ ఉండి మంచి హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ సుమంత్ కి ఒక సరైన సక్సెస్ అయితే రాలేదు.
అయితే కొన్ని హిట్ సినిమాలని రిజెక్ట్ చేసి ప్లాప్ అయ్యే సినిమాలను తీయడమే ఆయనకి పెద్ద మైనస్ గా మారింది./br>
ఇక రీసెంట్ టైం లో ఆయనకి దక్కిన హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ రావా ఒకటి సుబ్రమణ్య పురం ( Subramanya Puram )ఇంకొకటి ఈ రెండు సినిమాలతో సుమంత్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికి ఈయన ఆ తర్వాత చేసిన సినిమాలు మళ్ళీ ప్లాప్ అయ్యాయి దాంతో ఇప్పుడు హిట్ కొట్టడమే లక్ష్యం గా పెట్టుకొని సుబ్రమణ్య పురం సినిమా తీసిన డైరెక్టర్ సంతోష( Director Santosh ) తోనే వారాహి అనే ఒక సూపర్ స్టోరీ తో మన ముందుకు వస్తున్నాడు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా మీద సుమంత్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఈ సినిమా తో భారీ హిట్ కొట్టడం పక్క అంటూ సుమంత్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే సుమంత్ తో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు( Pawan Kalyan , Mahesh Babu ) లాంటి హీరోలు స్టార్ హీరోలు గా స్టార్ స్టేటస్ ని అందుకున్నారు…తను మాత్రం ఇక్కడే ఇలా ఒకటి రెండు హిట్లతో ఉండి పోవడానికి కారణం మొదట్లో ఆయన స్టోరీ సెలెక్షన్ అంత బాగా లేకపోవడమే అని చాలా మంది చెబుతూ ఉంటారు.ఇక సుమంత్ అటు హీరోగా చేస్తూనే మంచి క్యారెక్టర్ దొరికితే వేరే సినిమాల్లో కూడా క్యారెక్టర్లు చేస్తున్నాడు.సీత రామం, సార్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ లలో నటించి మెప్పించాడు…
.