ఆ మెగా హీరోతో సురేందర్ రెడ్డి..!

సైరా సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ సినిమా చేశాడు.ఈ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

 Surendar Reddy Next Movie Hero Finalised, Surendar Reddy , Uppena, Vishnav Teja-TeluguStop.com

ఏజెంట్ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఏజెంట్ ఫ్లాప్ అవడం వల్ల సురేందర్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చే హీరో లేకుండా పోయాడు.స్టార్ హీరోలెవరు ఇప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా చేయాలనే సాహసం చేయలేరు.

అందుకే యువ హీరోలతో సినిమాకు రెడీ అవుతున్నాడు సురేందర్ రెడ్డి.

తెలుస్తున్న సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి( Surendar Reddy ) తన నెక్స్ట్ సినిమా హీరోని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.అతనెవరో కాదు మెగా హీరో వైష్ణవ్ తేజ్.చరణ్ తో ధృవ తర్వాత సైరా ఛాన్స్ అందుకున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత అఖిల్ సినిమా చేశాడు.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ అవడం సురేందర్ రెడ్డి కెరీర్ మీద ఆ ఎఫెక్ట్ పడేలా చేసింది.సురేందర్ రెడ్డి ఈసారి కూడా వక్కతం వంశీ కథ మీద డిపెండ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube