పవన్ 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ అప్డేట్.. ఎక్కడ జరగబోతుందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.( Bro ) మెగా హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Pawan Kalyan And Sai Dharam Tej Bro Pre-release Event, Pawan Kalyan, Sai Dhara-TeluguStop.com

అందుకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఆ సమయం దగ్గర పడుతుంది.

జులై లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే టీజర్ రిలీజ్ కాబోతుంది అని బజ్ వస్తుంది.అతి త్వరలోనే బ్రో టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయబోతున్నారా అనే దానిపై న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించాలని మేకర్స్ అనుకుంటున్నారట.రాజమండ్రి అయితే రెస్పాన్స్ అదిరిపోతోందని భావిస్తున్నారట.పవన్ varahi కూడా అటు వైపునే సాగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ను కూడా అటు వైపే ప్లాన్ చేస్తే పవన్ కు కూడా వీలుగా ఉంటుందని అలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇదంతా పక్కన పెడితే సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న బ్రో సినిమాలో పవన్ పాత్ర తక్కువే అయిన ఆయన హ్యాండ్ అనేది ఉండడంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఉన్నారు.ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube