తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో ఒక నటుడికి ఘోర ప్రమాదం జరిగింది.ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్( Parvathamma Rajkumar ) తనయుడు అయినా నటుడు సూరజ్( Actor Suraj ) ప్రమాదానికి గురయ్యారు.
ఊటికి వెళుతున్న సమయంలో నంజన్ గూడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్ను లారీ ఢీకొట్టింది.అయితే ఆ ప్రమాదంలో సూరజ్( Suraj ) తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం సూరజ్ చికిత్స తీసుకుంటున్నాడు.కాగా టిప్పర్ సూరజ్ కాలుపై పడడంతో కాలు నుజ్జు నుజ్జు అయ్యింది.
దీంతో వైద్యులు మోకాలి వరకు కాలును తొలగించారు.
ప్రస్తుతం సూరజ్ మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.సూరజ్ ను చూసేందుకు నటుడు శివరాజ్ కుమార్, నిర్మాత చిన్నెగౌడ మైసుర్ చేరుకుని సూరజ్ కుటుంబాన్ని పరామర్శించారు.భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ( bhagavan Krishna Paramatma )సినిమాలో సూరజ్ నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ వార్త కన్నడ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇస్తున్న సూరజ్ కి ఇలా ప్రమాదం జరగడం అందులో కాలు పూర్తిగా చేయడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.
స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అని అనుకున్న సూరజ్ కలగానే మిగిలిపోయింది.అంతేకాకుండా సూరజ్ హీరో అవ్వాలి అనుకున్న కల కూడా చెదిరిపోయింది.సూరజ్ ఆ పరిస్థితిలో చూసిన అతని కుటుంబ సభ్యులు గుండెలు వెలసిన రోదిస్తున్నారు.కాగా ప్రస్తుతం సూరజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య నటుడు శివరాజ్ కుమార్ తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకొని సూరజ్ కుటుంబాన్ని పరామర్శించారు.సూరజ్ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించనున్నారు.