టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన గీతాకృష్ణ( Director Geetha Krishna ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.కోకిల సినిమాతో నేను నాజర్ ను పరిచయం చేశానని గీతాకృష్ణ అన్నారు.
ఇప్పుడు నాజర్ ( Nasser ) గ్రేట్ యాక్టర్ అని గీతాకృష్ణ వెల్లడించారు.రఘువరన్ కు చెడు అలవాట్లు ఉండటంతో నాజర్ ను ఎంపిక చేయడం జరిగిందని గీతాకృష్ణ అన్నారు.
ఆ సమయంలో నాజర్ కు 9000 ఇచ్చామని ఆయన తెలిపారు.
పరమవీరచక్ర సినిమా( Paramaveerachakra Movie ) హక్కులను అమ్మడానికి సి.
కళ్యాణ్( C Kalyan ) చాలా ఇబ్బంది పడ్డాడని గీతాకృష్ణ పేర్కొన్నారు.పరమవీరచక్ర శాటిలైట్ హక్కులు అమ్ముడు కాలేదని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు.
నా సినిమా హక్కులు మొత్తం సులువుగా అమ్ముడయ్యేవని ఆయన కామెంట్లు చేశారు.నేను ఇమేజ్ ఉన్న ఇన్ఫ్లూయెన్సియల్ పర్సన్ అని గీతాకృష్ణ పేర్కొన్నారు.
నేను గర్వంతో చెప్పడం లేదని ఆయన అన్నారు.

ఇక్కడ ఎవ్వరూ హెల్ప్ చేయరని ఆయన కామెంట్లు చేశారు.ఆర్జీవీ అగ్లీ ఇమేజ్ సంపాదించుకున్నాడని గీతాకృష్ణ వెల్లడించారు.ఆర్జీవీ నెగిటివ్ పబ్లిసిటీని కోరుకుంటున్నాడని ఆయన కామెంట్లు చేశారు.
ఆర్జీవీ సినిమాలు ఏవీ చూడలేదని గీతాకృష్ణ అన్నారు.యంగ్ స్టార్స్ ఆర్జీవీని ఫాలో అయితే బాగుంటుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

ఆర్జీవీ 2 లక్షల రూపాయలకు సినిమా తీశానని చెబుతాడని అయితే నిజ జీవితంలో రెండు లక్షల రూపాయలతో సినిమా తీయడం అనేది సాధ్యం కాదని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.గీతాకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.గీతాకృష్ణ విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.గీతాకృష్ణ గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.తీసింది తక్కువ సినిమాలే అయినా తరచూ ఇంటర్వ్యూల ద్వారా దర్శకుడు గీతాకృష్ణ వార్తల్లో నిలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.