మలబద్ధకం.కోట్లాది మందిని అత్యంత సర్వ సాధారణంగా వేధించే సమస్య ఇది.అయితే చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావిస్తుంటారు.కొందరు నిర్లక్ష్యం కూడా చేస్తుంటారు.
మలబద్ధకం అనేది చిన్న సమస్యే.కానీ అత్యంత ప్రమాదకరమైనది.
దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఏరి కోరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నవారు అవుతారు.అందుకే మలబద్దకాన్ని నివారించుకోవడం ఎంతో ముఖ్యం.
మిమ్మల్ని కూడా ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతుందా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఉండాల్సిందే.ఈ డ్రింక్ మలబద్దకాన్ని తరిమి కొట్టి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
అదే సమయంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి.
చివరిగా ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు కూడా వేసి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో కొద్దిగా తేనెను కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
నైట్ నిద్రించే ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.మలబద్ధకం సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.
ఈ డ్రింక్ ను రోజు కనుక తాగితే అసలు మలబద్ధకం అన్న మాటే అనరు.గ్యాస్ ఎసిడిటీ వంటివి కూడా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంది.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
కొద్దిరోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.