కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు మాజీ మంత్రి హరిరామ జోగయ్య శాస్త్రి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.పవన్ ని విమర్శించే స్థాయి ముద్రగడకు లేదని చెప్పారు.
పత్తిపాడులో ముద్రగడపై పోటీకి పవన్ అవసరం లేదని తెలిపారు.ఒక జన సైనికుడిని నిలబెట్టినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
పవన్ రోడ్డుపైకి వస్తే వేల మంది వస్తారన్న ఆయన ముద్రగడ పద్మనాభం వస్తే పది మంది కూడా రారని విమర్శించారు.వైసీపీ నేతల లేఖలను ముద్రగడ విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.
అనవసర విమర్శలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు.అనంతరం కాపుల కోసం ముద్రగడ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.