టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.మెగాస్టార్ తనయుడు గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇకపోతే రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లి అయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆ వీరికి సంతానం కలగడంతో మెగా ఇంట్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇటీవలే జూన్ 20 న దంపతులకు పండంటి ఆడబిడ్డ( Baby Girl ) జన్మించిన విషయం తెలిసిందే.దీంతో మెగా ఇంట్లో ప్రస్తుతం గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.

చెర్రీ అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.పాప పుట్టిన వెంటనే మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో లక్షల మంది పోస్ట్‌లు పెట్టారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక( Niharika ) రామ్ చరణ్ గురించి స్పందించింది.ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.గత ఏడాది రామ్ చరణ్ అన్న తండ్రి కానున్నాడని వార్త తెలిసినప్పటి నుంచి మా కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది.తన రాకతో రామ్ చరణ్ ఫ్యామిలీ పరిపూర్ణమైంది.
మెగా కజిన్స్ అందరినీ చరణ్ అన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.అందుకే తనని మేము బాపూజీ( Bapuji ) అని పిలుస్తాము.

అతడు ప్రతి వారిపై ప్రేమను చూపుతాడు.ఇక ఉపాసన వదిన ఒక శక్తిమంతమైన మహిళ.వీళ్లిద్దరి సంరక్షణలో ఆ పాప కచ్చితంగా గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్తుంది అని తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంది నిహారిక.పాప పుట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏకంగా మీడియాను ఏర్పాటు చేసి సంతోషంగా మీడియా ముందు మనవరాలు గురించి గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే.
పాప పుట్టినందుకు అందరి సంగతి ఏమో కానీ మెగాస్టార్ ఆనందానికి మాత్రం హద్దులు లేవని చెప్పవచ్చు.







