రష్మిక మందన్న తెలుగులో ఈమధ్య అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే.బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన అమ్మడు తెలుగులో మాత్రం రీసెంట్ గా నితిన్ సినిమా తప్ప మరే ఛాన్స్ అందుకోలేదు.
అయితే ఈమధ్య ఒక స్టార్ హీరో సినిమా నుంచి ఆఫర్ వచ్చినా చివరి నిమిషంలో అమ్మడు ఆ ఛాన్స్ మిస్ చేసుకుందని తెలుస్తుంది.అదేంటి అలా ఎందుకు జరిగింది అంటే ఆ పాత్రకు రష్మిక సూట్ అవదని మేకర్స్ అనుకున్నారట.
అయితే రష్మిక మాత్రం ఆ సినిమాలో నటించాలని అనుకుందట.
అవసరం అయితే రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తా కానీ సినిమా చేస్తానని అన్నదట.
కానీ మేకర్స్ మాత్రం ఆమెను కాదని మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.నేషనల్ క్రష్ రష్మికకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.
హిందీలో సినిమాలు హిట్ అయితే పరిథితి ఎలా ఉండేదో కానీ రష్మిక వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాయి.మరి తెలుగులో చేస్తున్న నితిన్ సినిమా అయినా హిట్ పడుతుందో లేదో చూడాలి.
రష్మిక స్టార్ ఛాన్స్ లు రాకపోయినా టైర్ 2 హీరోలతో కూడా నటించేందుకు సై అనేస్తుంది.