కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆదిపురుష్ సినిమా ఇంకా బాగుండేది...

ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) గురించే డిస్కషన్ జరుగుతుంది…రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ ( Prabhas ) రాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్.తానాజీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలుత గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.

 Prabhas Adipurush Movie Negative Points Details, Adipurush , Prabhas, Prabhas Ad-TeluguStop.com

ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా మీద విశేషమైన బజ్ క్రియేట్ చేశాయి.పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.

ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా రిలీజైన ఆదిపురుష్ ఆడియన్స్ ముందుకు వచ్చింది .ఐతే సినిమా ఫలితం పట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది .విజువల్ సూపర్ అంటున్నారు .కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు .రాఘవుడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ , స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు .లుక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదన్న టాక్ వినిపిస్తుంది …

 Prabhas Adipurush Movie Negative Points Details, Adipurush , Prabhas, Prabhas Ad-TeluguStop.com
Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas-Movie

ఇక జానకీ దేవిగా కృతి సనన్( Kriti Sanon ) బాగా సెట్ అయ్యిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు .ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో హావభావాలు చక్కగా పండాయి.నెగిటివిటీకి తావు లేకుండా ఆమె పాత్రను పోషించింది.

కాకపోతే.ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందనే టాక్ వినిపిస్తుంది .అలాగే .సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథనమే అనేది ఆడియెన్స్ మాట .ఈ సినిమా చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది.ఈ విషయంలో కాస్త శ్రద్ద తీసుకొని ఉంటె బాగుండేది .అలాగే సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు.దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ మీద పెట్టినంత శ్రద్ద కథాకథనాలు మీద పెట్టలేదనిపిస్తుంది.

ఆ విషయంలో కేర్ తీసుకొని ఉంటె బాగుండేది .

Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas-Movie

ఇక సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది.దీనికి తోడు సినిమా మొత్తం నెమ్మదిగా సాగుతూ ఉండటం వల్ల.ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగ్ చేయడం వల్ల ఆ సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది.ఆయా సన్నివేశాలపై ఇంకా ఫోకస్ పెడితే బాగుండేది .ఇంకా స్క్రీన్ ప్లే మరింత ఆకర్షణీయంగా ఉంటూ .ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.అలాగే రావణుడి గెటప్ విషయంలోను కొంత చేంజెస్ చేస్తే బాగుండేదనిపిస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube