ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ సినిమాను తెలుగు రెండు రాష్ట్రాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో డిస్టిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ).వివేక్ కూచిబొట్లతో కలిసి ఆయన భారీ సినిమాలు చేస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్, స్పిరిట్ సినిమాలను వారు తెలుగు రైట్స్ కొనేశారని తెలుస్తుంది.ఇదంతా వారు ఫ్యూచర్ లో ప్రభాస్ తో సినిమా చేయాలనే ప్లానింగ్ లో భాగమే అని అంటున్నారు.
ఆల్రెడీ పాన్ వరల్డ్, హాలీవుడ్ సినిమాలు చేయాలని ప్లానింగ్ లో ఉన్న విశ్వ ప్రసాద్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రైట్స్ భారీ రేటుకి కొన్నారు.
అల ప్రభాస్ తో టచ్ లో ఉంటూ వారి ప్రొడక్షన్ లో ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట.ఈమధ్య చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు పీపుల్ మీడియా దూసుకెళ్తుంది.హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వారు దూసుకెళ్తున్నారు.
మరి ప్రభాస్ తో వారి సినిమా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం.ఆదిపురుష్( Adipurush ) సినిమాతో మాత్రం వారు గట్టి ప్రాఫిట్స్ అందుకోవడం పక్కా అని అంటున్నారు.
సినిమాపై ఏర్పడ్డ ఈ పాజిటివ్ బజ్ సినిమా వసూళ్ల రూపం లో మారితే మాత్రం రికార్డులు బద్ధలైనట్టే లెక్క.