టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ( Sathya dev )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట చిన్న చిన్న పాత్రలతో నటిస్తూ కెరియర్ ను మొదలుపెట్టిన సత్యదేవ్ ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
హీరోగానే కాకుండా విలన్ గా సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే సత్యదేవ్ ఇటీవల గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.

కాగా సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం ఫుల్ బాటిల్( full bottle movie ).ఈ సినిమాలో ఆటో డ్రైవర్ గా నటిస్తున్నాడు.శరణ్ కొప్పిశెట్టి( Sharan Koppisetty ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.ఇక పోతే గతంలో శరన్ సత్యదేవ్ కాంబినేషన్ లో వచ్చిన తిమ్మరసు చిన్న మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు సరికొత్తగా రాబోతున్న ఫుల్ బాటిల్ సినిమా కూడా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.ఇందులో కామెడీ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ లో సత్యదేవ బాగా నటించాడు.ఇందుకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ టీజర్ లో సత్యదేవ బ్రహ్మాజీల ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది.మరి ముఖ్యంగా టీజర్ లో మేము బాలయ్య బాబు ఫ్యాన్స్.బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేస్తాం అంటూ సత్యదేవ చెప్పిన డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.ఫన్ తో పాటుగా కాస్త సీరియస్ యాంగిల్ కూడా ఫుల్ బాటిల్ టీజర్ లో కనిపిస్తోంది.
మరి ఈ సినిమా సత్యదేవ్ కు ఏ మేరకు సక్సెస్ తెచ్చి పెడుతుందో చూడాలి మరి.