ఓటిటీలో అలా రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 2.. ఆదరించడం కష్టమే!

మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో అందరికి తెలుసు.ఎన్నో ఏళ్లుగా తెరకెక్కించాలని అనుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు గత ఏడాది తెరకెక్కించాడు.

 Ponniyin Selvan 2 An Ott Release Details, Ponniyin Selvan Ott, Trisha, Aishwarya-TeluguStop.com

కోలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ను( PS 1 ) గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఈ భారీ పాన్ ఇండియా సినిమా 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పార్ట్ 1 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.

పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో మణిరత్నం పార్ట్ 2 ను మరింత వేగంగా పూర్తి చేసాడు.ఇక పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా పార్ట్ 1 కంటే పార్ట్ 2 కు మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం పార్ట్ 1 లో సగం కూడా రాలేదు.థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ పూర్తి చేసుకుంది.

మరి ఈ సినిమా థియేటర్స్ లో తేలిపోవడంతో ఓటిటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ వీడియో( Prime Video ) ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తెచ్చారు.కానీ ఇది ప్రస్తుతం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది.అన్ని భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఓటిటీలో కూడా 400 రూపాయలతో చూడాల్సి వస్తుంది.

మరి ఇంత పెట్టి ఓటిటిలో చూడడం కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube