మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha).క్షుద్ర పూజలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్(Sukumar) శిష్యులు కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.థియేటర్లలో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ మీడియాలో కూడా అదే ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమాలో జరిగే వరస మరణాల వెనుక ఉన్నటువంటి కారణమేంటి అన్న కథాంశంపై సినిమా మొత్తం సాగుతుంది.
ఇక ఈ సినిమాలో చివరికి విలన్ గా నటి సంయుక్త మీనన్ ను నటుడు రవి కిషన్(Ravi Kishan) చూపించారు.అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో ముందుగా నటి సంయుక్తని ఊహించలేదని ఇలా విలన్ పాత్రలో నటించడానికి యాంకర్ శ్యామల(Anchor Syamala) ఎంపిక చేసుకున్నామని తాజాగా డైరెక్టర్ కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.అయితే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఒకసారి స్క్రిప్ట్ సుకుమార్ గారికి వినిపించానని డైరెక్టర్ కార్తీక్ వెల్లడించారు.
స్క్రిప్ట్ మొత్తం చదివిన సుకుమార్ చిన్న మార్పులు చేశారని ఈయన వెల్లడించారు.
ఈ సినిమాలో శ్యామలను విలన్ పాత్రలో చూపించాలని తాను భావించాను కానీ సుకుమార్ గారు మాత్రం శ్యామల పాత్రను చంపేసి నటి సంయుక్త మీనన్ ను విలన్ గా చూపించారని ఈ సందర్భంగా కార్తీక్ దండు అసలు విషయం వెల్లడించారు.కేవలం సుకుమార్ గారి సూచనల మేరకు తాను ఈ మార్పులు చేశానని అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిందని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయం తెలిసి ఎంతో మంది యాంకర్ శ్యామల కనుక విలన్ పాత్రలో కనుక నటించి ఉంటే తనకు కూడా నటుడు రవి కిషన్ లాగే మంచి పేరు వచ్చేదని, శ్యామల మంచి పాత్రను మిస్ చేసుకుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.