కేసీఆర్ హెచ్చరికలు.. ఎమ్మెల్యే ల అలెర్ట్ ! 

కెసిఆర్( CM KCR ) హెచ్చరికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అలర్ట్ అయ్యారు.పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు.

 Kcr's Warnings.. Mla's Alert! Brs Mlas, Kcr, Ktr, Telangana Cm , Telangana Ele-TeluguStop.com

ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరు పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి అనే విషయంపై సర్వేలు నిర్వహిస్తూ వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నా,  కేసీఆర్ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ దానికనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత ఉండడం, వారికి మళ్లీ టిక్కెట్ ఇచ్చినా, గెలిచే అవకాశం లేదనే సర్వే నివేదికలతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.

Telugu Brs Mlas, Congress, Telangana Cm, Telangana-Politics

ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు పై సమగ్రంగా వివరాలు తెప్పించుకున్నారు.కొంతమంది ఎమ్మెల్యేగా పనితీరు ఏమాత్రం బాగోలేదు అని, నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకత ఉందని, వారికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదనే నివేదికలు కేసిఆర్ కు అందాయి.దీంతో ఎమ్మెల్యేలకు( Sitting MLAs) గట్టిగానే కేసీఆర్ క్లాస్ పీకారు.

దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గం లోని ఎక్కువ సమయం గడుపుతూ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.మండల,  గ్రామస్థాయి నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించారు.

దాదాపు 30, 35 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ( BRS party )ఎమ్మెల్యేలు స్థానిక నాయకులకు దగ్గరయ్యే విధంగా, ప్రజల్లో పరపతి పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులు , మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర నాయకులు చాలామంది ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటూ అసంతృప్తి తో ఉంటూ వచ్చారు.

ఇప్పుడు అటువంటి వారి అసంతృప్తిని పోగట్టి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ఎమ్మెల్యేలు చేపడుతున్నారు.

Telugu Brs Mlas, Congress, Telangana Cm, Telangana-Politics

ఇటీవల కాలంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, ఎమ్మెల్యేల వైఖరి కారణంగా దాదాపు 35 నియోజకవర్గాల్లో కేడర్ నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడం వంటి విషయాలతో ఎంపీలు, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులకు కేసీఆర్ అనేక సూచనలు చేశారు.వీటన్నిటి పైన అలర్ట్ అయిన ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకుని ప్రజలలో పరపతి పెంచుకుని , సొంత పార్టీ నాయకుల్లో తమపై ఉన్న అసమ్మతిని పోగొట్టే విధంగా చర్యలు చేపడుతూ,  మళ్లీ వచ్చే సర్వే నివేదికల్లో తమ పనితీరు మెరుగైందనే రిపోర్ట్ కేసీఆర్ వద్దకు వెళ్లే విధంగా గట్టిగానే కష్టపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube