Pawan Kalyan Puri Jagannath: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను నమ్మి పవన్ కళ్యాణ్ మోసపోయాడా.. ఇప్పటికీ వారికి మాటల్లేవా?

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలకు, నటీనటులకు మధ్య కొన్ని కొన్ని సార్లు సీరియస్ వార్ జరుగుతూ ఉంటుంది.కొంతమంది వాటిని మరిచిపోయి వెంటనే కలిసి పోగా మరికొంతమంది వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ అదే పగతో ఉంటారు.

 Was Pawan Kalyan Cheated By Believing Director Puri Jagannath-TeluguStop.com

అయితే డైరెక్టర్ పూరి, పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇదే జరుగుతుందని వారి మధ్య ఇప్పటికీ మాటల్లేవు అని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి, డైరెక్టర్ పూరి( Director Puri Jagannath ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.డైరెక్టర్ పూరి ఒకప్పుడు ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు.

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కించాడు.వారికి మంచి మంచి హిట్ లను అందించాడు.

కానీ ఈమధ్య ఆయనకు అసలు కలిసి రావడం లేదు.చేస్తున్న సినిమాలలో బాగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది.

Telugu Puri Jaganath, Liger, Pawan Kalyan, Pawankalyan, Tollywood-Movie

గత ఏడాది విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఎటువంటి టాక్ అందుకుందో చూసాం.దీంతో ఇప్పుడు ఈయనతో సినిమాలు చేయటానికి కూడా హీరోలు ముందుకు రావడానికి భయపడుతున్నట్లు తెలుస్తుంది.ఒకప్పుడు పూరితో సినిమా చేయాలి అని చాలామంది స్టార్ హీరోలకు కోరిక ఉండేది.కానీ ఇప్పుడు ఆయన సినిమాలు అంటే ఆమడ దూరం పోతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత క్రేజ్ పెంచుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

మామూలుగా పవన్ కళ్యాణ్ ఏ కొత్త దర్శకులకైన అవకాశం ఇస్తూ ఉంటాడు.అటువంటిది స్టార్ దర్శకులు వస్తే కళ్ళు మూసి వారి సినిమాలకు సైన్ చేసేస్తాడు.

అలా గతంలో డైరెక్టర్ పూరి తీసుకొచ్చిన కథకు కూడా పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్మి సైన్ చేశాడు.

Telugu Puri Jaganath, Liger, Pawan Kalyan, Pawankalyan, Tollywood-Movie

వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏదో కాదు కెమెరామెన్ గంగతో రాంబాబు.( Cameraman Gangatho Rambabu ) ఈ సినిమా 2012లో విడుదల కాగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోవటంతో డిజాస్టర్ అయ్యింది.అంటే ఈ సినిమా సమాజంలో ఉండే పరిస్థితుల గురించి రూపొందింది.

కానీ ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా అర్థం కాకుండా పోయింది.ఈ సినిమా కోసం డబ్బులు అయితే బాగానే ఖర్చు పెట్టారు నిర్మాతలు.

నిజానికి అప్పటివరకు చేసిన సినిమాల్లో పవన్ కు ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ తో రూపొందింది.దీంతో సినిమా ఫ్లాప్ అవ్వటంతో పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డాడు.

అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి కారణం డైరెక్టర్ పూరి అని ఓపెన్ గా చెప్పేసాడు పవన్ కళ్యాణ్.ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Puri Jaganath, Liger, Pawan Kalyan, Pawankalyan, Tollywood-Movie

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం డైరెక్టర్ పూరి అని నేరుగా చెప్పేశాడు.కథ చెప్పింది ఒకటి.తెరకెక్కించింది మరోకటి.షూటింగ్ టైంలో నేను అడిగాను.కానీ పూరి జగన్నాథ్ ఈ కథ బాగుంటుంది సార్ అంటూ మేనేజ్ చేశాడు.నేను కూడా పూరి జగన్నాథ్ ని నమ్మేశాను.

అలా గుడ్డిగా నమ్మడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని పవన్ అన్నాడు.అలా అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందని.

ఇప్పటికీ కూడా వారిద్దరు అంతగా మాట్లాడుకోవటం లేదు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube