వయసు పైబడిన యంగ్ గా మెరుస్తూ కనిపించాలని అందరికీ ఉంటుంది.కానీ ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, జీవన శైలి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ప్రెగ్నెన్సీ, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల ముప్పై ఏళ్లకే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.
వీటి వల్ల చాలా మంది తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు.ఈ క్రమంలోనే మడతలను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక మదన పడుతుంటారు.
అయితే వర్రీ వద్దు ముడతలను తరిమి కొట్టడానికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ముడతలు దెబ్బకు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green tea powder ), రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత అందులో ఒక ఎగ్ వైట్( Egg white ), వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ( Corn flour )వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ముడతలు క్రమంగా మాయం అవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.
అలాగే చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.స్కిన్ షైనీ అండ్ గ్లోయింగ్ గా తయారవుతుంది.
కాబట్టి చిన్న వయసులోనే ముడతల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.అందంగా, యవ్వనంగా మెరిసిపోండి.