ఆర్మీలో ఉద్యోగం ఉంటే మంచి జీతంతో పాటు సమాజంలో గౌరవం కూడా ఉంటుంది.ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూ చదువుతుంటారు.
జాబ్ వస్తే జీవితం సెట్ అయినట్టే.ఓ యువకుడు ఆర్మీలో కానిస్టేబుల్ గా( Army Constable ) ఉద్యోగం సంపాదించి తరువాత చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.
చివరికి మిత్రుడి సలహాతో దొంగగా మారి( Thief ) జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అనంతపురం లోని( Anantapuram ) ప్రియాంక నగర్ కు చెందిన గులాం సద్దాం హుస్సేన్ కు 2011లో ఆర్మీలో సహస్రాసీమబల్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది.
ప్రస్తుతం అస్సాంలో ఉద్యోగం చేస్తున్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.కానీ సద్దాం హుస్సేన్ ఉద్యోగం వచ్చిన కొంతకాలానికి మద్యానికి బానిస అయ్యాడు.అంతేకాకుండా పేకాట అడటం మొదలుపెట్టి జీతాన్ని దుబారాగా ఖర్చు చేయడంతో పాటు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేసేసాడు.

ఇక సద్దాం హుస్సేన్ కు ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేశాయి.దీంతో గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన స్నేహితుడు రాజశేఖర్ కు తన పరిస్థితి గురించి చెప్పుకున్నాడు.అప్పుడు రాజశేఖర్ మరో దారుణమైన సలహా ఇచ్చాడు.రాజశేఖర్ బైక్ దొంగతనాలు చేసి.అమ్మి సొమ్ము చేసుకునేవాడు.సద్దాం హుస్సేన్ కు కూడా ఈ సలహా ఇచ్చి.
కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పాడు.

ఈ ఉచిత సలహా సద్దాం హుస్సేన్ కు నచ్చడంతో అస్సాం నుండి పలుమార్లు సెలవు పెట్టి స్థానికంగా బైక్ లు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.దొంగలించిన బైక్ లను అనంతపురం నగర శివారులో ఉండే నేషనల్ పార్క్ సమీపంలోని ఓ పాడుపడ్డ షెడ్డులో దాచేవారు.ఈ మధ్య బైక్ చోరీల కేసులు అధికంగా వస్తూ ఉండడంతో పోలీసులు ప్రత్యేక నిగా ఏర్పాటు చేసి తాజాగా గుత్తి రోడ్డులోని మార్కెట్ యాడ్ వద్ద సద్దాం హుస్సేన్, రాజశేఖర్ లను అరెస్టు చేశారు.
నిందితుల నుండి 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.