అమెరికా : ఆఫీస్‌కు వెళ్తూ అదృశ్యం.. పక్క రాష్ట్రంలో శవమై తేలిన భారత సంతతి మహిళ

అమెరికాలో( America ) విషాదం చోటు చేసుకుంది.అదృశ్యమైన 25 ఏళ్ల భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది.

 Indian-american Woman From Texas Found Dead Mysteriously In Oklahoma Details, In-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.మృతురాలిని లహరి పతివాడగా( Lahari Pathivada ) గుర్తించారు.

ఆమె కాలిన్స్ కౌంటీలోని మెక్ కిన్నే‌లో నివసిస్తున్నారు.ఈమె చివరిసారిగా డల్లాస్ శివారులోని ఎల్ డోరాడో పార్క్ వే, హార్డిన్ బౌలేవార్డ్ ప్రాంతంలో తన బ్లాక్ టయోటాను నడుపుతూ కనిపించారు.

అయితే మే 12న లహరి తన విధులు ముగించుకుని ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.అయితే లహరి ఫోన్ ఓక్లహోమాలో( Oklahoma ) ట్రాక్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషయాన్ని పోలీసులకు తెలిపారు.

అయితే మే 13న తన ఇంటికి దాదాపు 322 కిలోమీటర్ల దూరంలోని ఓక్లహోమా రాష్ట్రంలో లహరి శవమై కనిపించింది.

మృతురాలి ఫేస్‌బుక్ పేజీ ప్రకారం.

ఓవర్‌లాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో లహరి పనిచేస్తున్నారు.ఆమె టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు.

బ్లా వ్యాలీ వెస్ట్ హైస్కూల్‌లో చదువుకున్నారు.లహరి ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అయితే లహరి మరణానికి కారణమైన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం ఎక్కడ కనిపించింది అనే దానితో పాటు మిస్సింగ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని పోలీసులు ఇంకా విడుదల చేయాల్సి వుంది.

Telugu Ankit Bagai, Dallas, Indian American, Nri, Oklahoma, Texas-Telugu NRI

ఇకపోతే.గత నెలలోనూ ఓ భారతీయుడు ఇలాగే అదృశ్యమై శవమై తేలాడు.ఏప్రిల్ 9న మిస్సయిన 30 ఏళ్ల అంకిత్ బగై అనే టెక్కీ మృతదేహాన్ని మేరీల్యాండ్‌లోని చిన్న సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.లేక్ చర్చిల్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.మృతదేహాన్ని వెలికి తీసి, అనంతరం చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు.

Telugu Ankit Bagai, Dallas, Indian American, Nri, Oklahoma, Texas-Telugu NRI

అతని కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.అంకిత్ జర్మన్‌టౌన్‌లోని ఓ ఆసుపత్రి నుంచి అదృశ్యమయ్యాడు.చివరిసారిగా 12000 పాంథర్స్ రిడ్జ్ డ్రైవ్‌లో కనిపించాడు.బగై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని.నిత్యం మందులను వాడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.అంకిత్ అదృశ్యం కావడంతో అతని కోసం తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా అంకిత్ ఆచూకీ తెలిపిన వారికి 5 వేల డాలర్ల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.

అటు పోలీసులు కూడా అంకిత్ కోసం తీవ్రంగా గాలించారు.

ఈ క్రమంలో అతని వివరాలతో కూడిన ఫేస్‌బుక్ పేజీని కూడా ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో అంకిత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న అంకిత్.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube