కేరళ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి షిప్ లో తరలిస్తున్న సుమారు 2,500 కిలోల మెథాంఫెటమిన్ ను నేవీ, నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.కాగా సముద్ర మార్గంలో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు నేవీ, నార్కోటిక్స్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.అదేవిధంగా ఈ షిప్ కేరళ తీరం ద్వారా శ్రీలంకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.