మెగా ఫ్యామిలీ హీరోలు ఎంత మంది ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్( Pawan kayan ) క్రేజ్ ని మాత్రం ఎవరూ తట్టుకోలేరు.ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్( Harish Shankar )లో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మే 11 ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ గ్లింప్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తమిళ చిత్రం తెరికి ఈ సినిమా రీమేక్ అని అంటున్నారు కానీ.
గ్లింప్స్ చూస్తుంటే ఆ ఛాయలేవీ కనపడటమే లేదు.ఇక హరీష్ శంకర్ మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు.
అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన తీరుకి గ్లింప్స్ ఓ చిన్న టచ్ మాత్రమే.సినిమా నెక్ట్స్ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అభిమానుల అంచనాలను రీచ్ కావడంతో పాటు మరింత హైప్ ని క్రియేట్ చేసింది.
పదేళ్ల కింద పవన్ కళ్యాణ్ – హరిష్ శంకర్ కాంబోలో బ్లాక్ బస్టర్ ఫిలిం గబ్బర్ సింగ్ వచ్చింది .ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు .అశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది.దీంతో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై తారస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
మూడేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన హరీష్ శంకర్ మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు.గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గల్లా లుంగీ, ఖాకీ డ్రెస్, మాస్ స్వాగ్ తో ఇరగదీశారు.ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు…
తాజాగా గ్లిమ్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan ) స్పందించారు.ట్విట్టర్ వేదిక గా గ్లింప్సెస్ పై రియాక్ట్ అయ్యారు.‘పవన్ కళ్యాణ్ గారి మాసీ గ్లింప్స్ బాగా నచ్చింది.థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.‘ఉస్తాద్ భగత్ సింగ్’టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.ప్రస్తుతం ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట దుమ్ములేపుతోంది.
కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 2 కోట్ల వ్యూస్ దక్కించుకుంది.గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే మున్ముందు వచ్చే అప్డేట్స్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవ్వడం ఖాయమన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా నటిస్తోంది.ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.
దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజికల్ బ్లాస్ట్ తో థియేటర్లను బద్దలు చేయబోతున్నారని అర్థం అవుతోంది.త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇక రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నాడు .ఇదిలా ఉంటె పవన్ గ్లింప్స్ పై చరణ్ స్పందించడంతో .బన్నీ స్పందనపై అభిమానుల్లో చర్చలు సాగుతున్నాయి అలాగే చరణ్ ఇంత లేటుగా రియాక్ట్ కావడంపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు .