సెంట్రల్ అమెరికా దేశం అయిన నికరాగ్వాలో( Nicaragua ) దారుణం చోటుచేసుకుంది.ఇక్కడ తేనెటీగలు( Honey Bees ) 6 మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి.
మృతులలో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉండటం విషాదకరం.వివరాల్లోకి వెళ్తే, ఇటీవల జినోటెగా నుంచి దేశంలోని వాయువ్య ప్రాంతంలోని శాన్ సెబాస్టియన్ డి యాలీకి ఒక బస్సు బయలుదేరింది.
ఈ బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఎక్కారు.కొంత దూరం వెళ్ళాక బస్సు పలు తేనెతెట్టెల పైకి దూసుకెళ్లింది.
దాంతో తేనెటీగల గుంపు ఒక్కసారిగా ఎగిసి పడింది.
మెకానికల్ లోపంతో బస్సు అదుపు తప్పి 160 అడుగుల లోయలో పడిపోయింది.అప్పటికే ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు.దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.ఈ ప్రదేశంలోని ఆఫ్రికనైజ్డ్ తేనెటీగల గుంపు( Africanized Bees ) బస్సులోని ప్రయాణికులపై దాడి చేసింది.
సుమారు 45 మంది ప్రయాణికులను అవి దారుణంగా కుట్టాయి.దీనివల్ల 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి, తేనెటీగ కుట్టడం వల్ల ఆరుగురు మరణించారు.
గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆసుపత్రులకు తరలించగా, మరికొందరిని జినోటెగాలోని వైద్య కేంద్రానికి తరలించారు.ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గాను మారాయి వీటిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ ప్రమాదంపై నేషనల్ పోలీస్ ట్రాన్సిట్ యూనిట్ విచారణ ప్రారంభించింది.నేచురల్ హిస్టరీ మ్యూజియం నివేదిక ప్రకారం, ఆఫ్రికనైజ్డ్ తేనెటీగలను వాటి దూకుడు ప్రవర్తన కారణంగా కిల్లర్ బీస్ అని పిలుస్తారు.
ఈ తేనెటీగలు దక్షిణ, మధ్య, ఉత్తర అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి.