అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే.ఆ మాటలు అన్నది ఓ సీనియర్ ట్విట్టర్ ఉద్యోగి.
ఇంకా అతడు దానికి ప్రూఫ్స్ కూడా షేర్ చేయడం ఇపుడు పెను దుమారాన్ని సృష్టిస్తోంది.వాట్సాప్( Whatsapp ) ఖాతాదారుల మొబైల్స్‌లోని మైక్రోఫోన్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో ఉపయోగిస్తుందని ట్విట్టర్ ఉద్యోగి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంకా ఈ ఆరోపణలకు సంబంధించి స్క్రీన్ షాట్‌లను జత చేస్తూ ట్వీట్ చేయడంతో సదరు ట్వీట్‌పై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ( Elon Musk )స్పందించి, వాట్సాప్‌ను నమ్మలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక, దాంతో ట్విట్టర్ వర్సెస్ వాట్సాప్ మాదిరి తయారయ్యింది.ఇకపోతే ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వాయిస్ కాల్‌లు, వీడియో కాల్‌లు కూడా చేయగలుగుతారనే విషయం మస్క్( Musk ) ఆమధ్య పేర్కొన్నాడు.త్వరలో ట్విట్టర్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చని కూడా వివరించాడు.
ఈ నేపథ్యంలోనే, వాట్సాప్ పైన కుట్ర పన్నిన ట్విట్టర్ అధినేత కావాలనే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని వాట్సాప్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
కాగా, ట్విట్టర్ సేవలు ఏ మాత్రం ఆకట్టుకుంటాయో? చూడాలి.ఇకపోతే సదరు ట్విట్టర్ ఉద్యోగి ఆరోపణలపై స్పందించిన వాట్సాప్ సదరు ట్విట్టర్ ఉద్యోగి వాడేది గూగుల్ పిక్సెల్( Google Pixel ) ఫోన్ అని, ఆండ్రాయిడ్‌లో తమ గోప్యతా డాష్‌బోర్డ్‌లో సమాచారాన్ని తప్పుగా ఆపాదించే బగ్ కారణంగా ఆ సమస్య తలెత్తిందని వివరణ ఇస్తూ.ట్విట్టర్ ని ఎండగట్టింది.
అయితే సదరు సమస్యను మాత్రం పరిష్కరిస్తామని చెబుతూ చాలా కూల్ గా సమాధానం ఇచ్చింది.సమస్యను పోస్ట్ చేసిన ట్విట్టర్ ఇంజినీర్‌తో టచ్‌లో ఉన్నామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ ద్వారా స్పందించింది.