'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది.. మరి జాగ్రత్తలు వర్కౌట్ అయ్యాయా?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ( Adipurush ) ఒకటి.ఈ సినిమా అన్నిటి కంటే ముందుగా రిలీజ్ కాబోతుంది.

 Prabhas Adipurush Official Trailer Telugu, Prabhas, Kriti Sanon, Saif Ali Khan,-TeluguStop.com

ఇక రిలీజ్ కు నెల మాత్రమే ఉండడంతో మేకర్స్ గత కొన్ని రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.

భూషణ్ కుమార్, ఓం రౌత్, రాజేష్ మోహనన్, కృష్ణ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.మరి ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.గత కొన్ని రోజులుగా ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.మరి నిన్న ఈ సినిమా ట్రైలర్ ను పలు థియేటర్స్ లో ప్రదర్శించారు.

ఇక ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ చేయగా సంచలన రెస్పాన్స్ లభిస్తుంది.ఈ సినిమా నుండి వచ్చిన తాజా ట్రైలర్ చూస్తుంటే మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తుంది.

అప్పటికి ఇప్పటికి వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తెలుస్తున్నాయి.

ఈ ట్రైలర్ ( Adipurush Official Trailer ) ఆద్యంతం ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపించి అలరించారు.సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా రావణాసురిడిగా తన పాత్రకు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది.ఏది ఎలా ఉన్న మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సినిమా ట్రైలర్ లో అక్కడక్కడ ఇంకా వీఎఫ్ఎక్స్ మరికొద్దిగా మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

మొత్తానికి పూర్తిగా కాకపోయినా ఈ ట్రైలర్ తో కొంతమేర నెగిటివిటీని అయితే పోగొట్టుకున్నారు అనే చెప్పాలి.మరి ఆదిపురుష్ ట్రైలర్ మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.

https://youtu.be/e3ew7YUeeQc
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube