‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేసింది.. మరి జాగ్రత్తలు వర్కౌట్ అయ్యాయా?
TeluguStop.com
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్' ( Adipurush ) ఒకటి.
ఈ సినిమా అన్నిటి కంటే ముందుగా రిలీజ్ కాబోతుంది.ఇక రిలీజ్ కు నెల మాత్రమే ఉండడంతో మేకర్స్ గత కొన్ని రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.
"""/" /
భూషణ్ కుమార్, ఓం రౌత్, రాజేష్ మోహనన్, కృష్ణ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
మరి ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
గత కొన్ని రోజులుగా ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి నిన్న ఈ సినిమా ట్రైలర్ ను పలు థియేటర్స్ లో ప్రదర్శించారు.
ఇక ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ చేయగా సంచలన రెస్పాన్స్ లభిస్తుంది.
ఈ సినిమా నుండి వచ్చిన తాజా ట్రైలర్ చూస్తుంటే మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తుంది.
అప్పటికి ఇప్పటికి వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తెలుస్తున్నాయి. """/" /
ఈ ట్రైలర్ ( Adipurush Official Trailer ) ఆద్యంతం ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపించి అలరించారు.
సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా రావణాసురిడిగా తన పాత్రకు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది.
ఏది ఎలా ఉన్న మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సినిమా ట్రైలర్ లో అక్కడక్కడ ఇంకా వీఎఫ్ఎక్స్ మరికొద్దిగా మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
మొత్తానికి పూర్తిగా కాకపోయినా ఈ ట్రైలర్ తో కొంతమేర నెగిటివిటీని అయితే పోగొట్టుకున్నారు అనే చెప్పాలి.
మరి ఆదిపురుష్ ట్రైలర్ మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
నా భర్త అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!