సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు( Samantha Ruth Prabhu ) ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక గత నెల ఏప్రిల్ 28న సామ్ తన 36వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే.అయితే ఈమె పుట్టిన రోజు అయిపోయిన తర్వాత ఈమెకు సిటాడెల్ టీమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈమె ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ( Citadel web series )షూట్ లో బిజీగా ఉంది.దీంతో సెట్స్ లో ఈమె పుట్టిన రోజును గ్రాండ్ గా నిర్వహించి సామ్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.
టీమ్ అంతా కలిసి ఏమిటో కేక్ కట్ చేయించి ఆమె పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసారు.ఇందుకు సంబంధించిన వీడియోలను సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈమె ఈ వీడియో పోస్ట్ చేస్తూ.పుట్టిన రోజు నాడు కుటుంబానికి దూరంగా ఉండడంతో ఎవ్వరూ సర్ప్రైజ్ ఇవ్వరు అనుకున్న అని చెప్పుకొచ్చింది.కానీ సిటాడెల్ చిత్రబృందం స్పెషల్ సర్ప్రైజ్ ను ఇచ్చి ఆమె ఎగ్జైట్ అయ్యేలా చేసింది.ఈ ఫోటోలు, వీడియోల్లో సామ్ మరింత అందంగా, స్టైలిష్ గా కనిపిస్తుంది.
ఇక సిటాడెల్ విషయానికి వస్తే.ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ( Raj and DK )లు డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సమంత కూడా కీలక రోల్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సిరీస్ చేస్తూనే మరో పక్క తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా చేస్తుంది.
ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.చూడాలి సామ్ మళ్ళీ వరుస అవకాశాలు అందుకుంటుందో లేదో.