హైదరాబాద్ :ఢీల్లీ లోని వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న భారాస కేంద్ర కార్యాలయాన్ని (తెలంగాణ భవన్) ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఈ మేరకు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం ఢిల్లీ కి ఆయన వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.నాలుగు అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు.
సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఢిల్లీకి పయనమయ్యారు.
‘ఢిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి ఇక్కడి నడిబొడ్డున భారాస సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
భారాస కేంద్ర కార్యాలయం పనులను సంతోష్ కుమార్‌తో కలిసి సోమవారం కేసీఆర్ పరిశీలించారు.