న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఉద్యమ కార్యచరణను ప్రకటించిన ఏపీ జెఎసి

ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మూడోదశ ఉద్యమ కార్యచరణను ప్రకటించారు.ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రెండు దశల్లో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines,gold Rate, N-TeluguStop.com

2.చంద్రబాబు , రజనీకాంత్ లపై కొడాలి నాని కామెంట్స్


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

చంద్రబాబు రజనీకాంత్ లకు భవిష్యత్తు లేదని,  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani ) విమర్శించారు.

3.గుడివాడలో నాని దే విజయం : పేర్ని నాని

గుడివాడ ఈసారి కూడా కొడాలి నాని విజయం సాధిస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని( Perni Nani ) అన్నారు.

4.కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు

కాంగ్రెస్ వి బద్దగింపు రాజకీయాలినని , అది అభివృద్ధికి అవరోధంగా మారుతాయి అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.

5.మా నినాదం వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ : జనసేన


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ మా పార్టీ విధానం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) అన్నారు.

6.అన్నవరం సమాచారం

అన్నవరం సత్యదేవుని ఆలయంలో నేటి నుంచి కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.  ఉత్సవాలు జరిగే ఏడు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేశారు.

7.  వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

నేటి నుంచి ద్వారకా తిరుమల వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.మే 4 స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం 5న స్వామి వారి రథోత్సవం( Rathotsavam ) ,  7 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

8.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

నేటితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసింది.  నేడు జనగామ నియోజకవర్గంలో కొనసాగుతోంది.

9.టిడిపి మహానాడు

తెలుగుదేశం పార్టీ మహానాడు( TDP Mahanadu ) మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న నాయుడు తెలిపారు.

10.నేడు తెలంగాణ సచివాలయం ప్రారంభం

 నేడు డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఘనంగా 1.20 నిమిషాలకు  కెసిఆర్( CM KCR ) ప్రారంభించారు.

11.రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ అన్నారు.

12.సోము వీర్రాజు కామెంట్స్


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) స్పందించారు.రాజకీయాల్లో ఈ తరహా బేటీలు జరుగుతూనే ఉంటాయని దీనిపై తాను కామెంట్ చేయబోనని వీర్రాజు అన్నారు

13.పోడు పట్టాల మార్గదర్శకలపై కేసీఆర్ సంతకం

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ పోడు పట్టాల మార్గదర్శకాలపై తొలి సంతకం చేశారు.

14.చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయాల్లోకి వచ్చారని మాజీమంత్రి,  మచిలీపట్నం ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

15.లోకేష్ విమర్శలు

ఫిర్యాదులు లేని కేసుల్లో బీసీ టిడిపి నేతలు అయిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  ఆదిరెడ్డి వాసులను అదుపులోకి తీసుకోవడం ఏ వన్ దొంగ పాలనలోనే సాధ్యమవుతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

16.  ఘంటా శ్రీనివాసరావు విమర్శలు

వై నాట్ 175 కాదు, వై నాట్ పులివెందుల అని మేము అంటాం అని జగన్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు.

17.నష్టపోయిన రైతులను ఆదుకోరా .షర్మిల


Telugu Chandrababu, Cm Kcr, Gold, Janasena, Kodali Nani, Lokesh, Pawan Kalyan, P

కెసిఆర్ ది దిక్కుమాలిన పాలన అని, పంట నష్టపోయి రైతులు బాధల్లో ఉంటే వారిని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం దారుణమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YSRTP Sharmila ) విమర్శించారు.

18.తెలంగాణ టిడిపి అధ్యక్షుడు వ్యాఖ్యలు

బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.

19.షర్మిలకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో ఈరోజు పర్యటిస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అస్వస్థతకు గురయ్యారు.

20.టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ

టిఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది.

ఈ మేరకు తెలంగాణ రాజ్యసమితి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube