Rajamouli: ఏంటి పెళ్లికి ముందే రాజమౌళి తండ్రి అయ్యాడా.. బయటపడ్డ అసలు నిజం?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి.చాలావరకు వాళ్ళ వ్యక్తిగత విషయాలు వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి.

 Did Rajamouli Become Father Before His Marriage-TeluguStop.com

ఎందుకంటే అందులో అంత డెప్త్ ఉంటుంది కాబట్టి.ఇప్పటికే చాలామంది నటీనటులు తమ ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో హాట్ టాపిక్ గా నిలిచారు.

ఇక కొంతమంది సెలబ్రెటీలు పెళ్లికి ముందే తల్లితండ్రులు కూడా అయ్యారు.అందులో కొందరు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారని చెప్పాలి.కేవలం హీరో హీరోయిన్లే కాదు దర్శక నిర్మాతలు కూడా తమ వ్యక్తిగత విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తారు.వాళ్లు కూడా వాళ్ల పెళ్లిళ్ల విషయంలోనే ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటారు.

ఇప్పటికే నిర్మాత దిల్ రాజ్( Dil Raju ) రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అయితే దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) కూడా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు అని ఒక వార్త నెట్టింట బాగా హల్చల్ చేస్తుంది.

అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే.బాహుబలి తర్వాత ఈయన పాన్ ఇండియా డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Rajamluli, Karthikeya, Keeravani, Mahesh Babu, Mm Keeravani, Rajamouli, R

ఈయన తొలిసారిగా బుల్లితెరపై సీరియల్ డైరెక్టర్ గా పని చేశాడు.చాలా సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.తర్వాత వెండితెరపై కూడా అడుగు పెట్టాడు.

అలా 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నాడు.

చాలావరకు మంచి మంచి హిట్ లు అందుకున్నాడు.చిన్న హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చాడు.ఇక బాహుబలి తర్వాత ఈయన రేంజ్ మొత్తం మారిపోయింది.టాలివుడ్ ప్రేక్షకులే కాదు ఇతర భాషకు చెందిన ప్రేక్షకులు సైతం ఈయన సినిమాలకు ఫిదా అయ్యారు.

ఇక పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ఈయన లైఫ్ మరింత టర్న్ అయ్యింది.ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సినిమాతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు.

Telugu Rajamluli, Karthikeya, Keeravani, Mahesh Babu, Mm Keeravani, Rajamouli, R

ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేయనున్నాడు.ఇదంతా పక్కన పెడితే.రాజమౌళి గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇంతకు అదేంటంటే.రాజ‌మౌళి పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు.ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య ర‌మ‌, కొడుకు కార్తీకేయే స్వ‌యంగా తెలిపారు.

రాజ‌మౌళితో పెళ్లికి ముందే ర‌మకు మ‌రో వ్య‌క్తితో పెళ్లి అవ్వగా వారికి కార్తీకేయ పుట్టాడు.ఇక మ‌న‌స్ప‌ర్థ‌ల వల్ల మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన ర‌మ( Rama ) ఆ త‌ర్వాత అన్న సోద‌రి వ‌ల్లీ (కీర‌వాణి భార్య‌) ఇంట్లో ఉండేదట.

ఆ సమయంలో ఆమెకు రాజమౌళితో మంచి సంబంధం ఏర్పడింది.

Telugu Rajamluli, Karthikeya, Keeravani, Mahesh Babu, Mm Keeravani, Rajamouli, R

ఆ సమయంలో కార్తికేయ ఎనిమిదేళ్ల వయసులో ఉండగా.రాజమౌళి కార్తికేయను కొడుకుగా చూసుకునేవాడట.అలా రమతో రాజమౌళికి మంచి బంధం ఏర్పడటంతో వారిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారని తెలిసింది.

పెళ్లి త‌ర్వాత రాజ‌మౌళి, ర‌మ దంప‌తులు మ‌యూఖ అనే కుమార్తెను ద‌త్త‌త తీసుకున్నారు.అలా రాజమౌళి ముగ్గురికి మంచి లైఫ్ అందించాడు అని ఆయన అభిమానులు అంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube