దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi ) గతవారం గురుగ్రామ్ లో జరిగిన మహిళ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఓ ప్లాస్టిక్ బ్యాగ్ తో( Plastic Bag ) పోలీసులు కేసును చేధించి నిందితున్ని పట్టుకున్నారు.
మహిళను హత్య చేసింది ఎవరో కాదు ఆమె భర్తనే. పోలీసుల విచారణలో నమ్మలేని వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
నేవీలో కుక్ గా పనిచేసిన జితేందర్(34) 2022లో రిటైర్మెంట్ తీసుకున్నాడు.అయితే జితేందర్ కు( Jitender ) మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది.
ఈ విషయం భార్యకు తెలియడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉండడంతో భార్యను హత్య చేసి, పోలీస్ స్టేషన్లో భార్య పై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
జితేందర్ భార్య మొండెం కనిపించిన గదిలో, భారత నేవీకి సంబంధించిన ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేసి, చుట్టుపక్కల ఉండే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అసలు నిజం బయటపడింది.జితేందర్ బైక్ పై వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ నిండుగా ఉంది.తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ బ్యాగుతో వచ్చాడు.
దీంతో పోలీసులకు జితేందర్ పై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేస్తే భార్య సోనియా శర్మ (28)ను హత్య చేసినట్లు అంగీకరించాడు.తనకు వేరే మహిళతో శారీరక సంబంధం ఉందని ఆ విషయం భార్యకు తెలియడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
అంతేకాకుండా కడుపున పుట్టిన 8 ఏళ్ల కూతురిని కూడా హత్య చేసినట్లు, మరో మహిళతో తాను రహస్య వివాహం చేసుకున్న విషయాలను బయట పెట్టాడు.
భార్యను హత్య చేసిన జితేందర్ సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాలలో పడేశాడు.ఇక ఇంట్లో ఉండే కోన్ని భాగాలను తగుల బెట్టెందుకు ప్రయత్నించాడు.పోలీసులకు ముందుగా మహిళా కాళ్లు లభించాయి.
ఆమె తలను గురువారం మనేసరులోని ఓ ప్రదేశంలో గుర్తించారు.ప్లాస్టిక్ బ్యాగ్ కారణంగా జితేందర్ పై అనుమానం రావడంతో విచారణలో అన్ని నిజాలు బయటపడ్డాయి.
శుక్రవారం సిటీ కోర్టులో జితేందర్ ను హాజరు పరచగా కోర్టు మూడు రోజులు రిమాండ్ కు తరలించిందని పోలీసులు తెలిపారు.