కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లియో’ (Leo).భారీ అంచనాలు నెలకొన్న తమిళ్ క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా పాన్ ఇండియా బరిలో ఉంది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.వీరి కాంబోలో రాబోతున్నట్టు రెండవ సినిమా ఇది.అంతేకాదు లోకేష్ (Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాపై తమిళ్ లో ఇప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
మామూలుగానే విజయ్ అన్ని సినిమాలకు ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరుగుతుంది.ఇక ఇప్పుడు కూడా లియో సినిమాలు ఆడియో లాంచ్ (Leo audio launch) చేయాలి అని నిర్మాతలు చూస్తున్నారట.అది కూడా భారీ స్థాయిలో అని తెలుస్తుంది.ఎప్పుడు చెన్నైలోనే జరుగుతుండడంతో ఈసారి తమిళనాడు లోని మరో పెద్ద సిటీలో ప్లాన్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
లియో కోసం ఎలాంటి ప్లాన్ ను రెడీ చేస్తారో వేచి చూడాలి.ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.లోకనాయకుడు కమల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.