రోడ్డుపై పరుగులు తీస్తున్న రోబో రిక్షాలు.. క్యాబ్‌లకు పోటీ అవుతాయని అంచనాలు

ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకూ మార్పులు చెందుతోంది.నిత్యం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల మన రోజువారీ పనులు ఎన్నో సులువుగా మారాయి.

 Robot Rickshaws Running On The Road Are Expected To Compete With Cabs , Robot Ri-TeluguStop.com

ముఖ్యంగా మన దైనందిన జీవితంలో లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో పనులు టెక్ ప్రొడక్ట్స్ వల్ల కష్టం లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాం.ఇటీవల కాలంలో రోబోల( robots ) వినియోగం ఇళ్లల్లోనూ పెరిగింది.

రోబోటిక్ టెక్నాలజీతో కూడిన ఎన్నో టెక్ ప్రొడక్ట్స్( Tech products ) మనకు పలు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

తాజాగా సూరత్‌కు( Surat ) చెందిన నలుగురు విద్యార్థుల బృందం రోబోను రూపొందించింది.ఈ రోబోట్ మనిషిలా నడవగలదు.అంతేకాకుండా మనం కూర్చున్న రిక్షాను కూడా లాగగలదు.

దీనిని తయారు చేయడానికి ఆ విద్యార్థులకు 25 రోజుల సమయం పట్టింది.

రోబోట్ తయారు చేయడానికి మొత్తం రూ.30 వేలు మాత్రమే అయిందని విద్యార్తులు చెబుతున్నారు.వారిలో ఒకరైన మౌర్య శివమ్ ( Maurya Shivam )పలు విషయాలు వెల్లడించారు.

దీనిని రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చన్నారు.దీనిని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పాడు.రోడ్డుపై నడిచేందుకు వీలుగా దీనిపై ప్రయోగాలు చేశామని, అవి సక్సెస్ అయ్యాయని పేర్కొన్నారు.“ఇది మేము రహదారిపై పరీక్షించిన ఒక మోడల్.

ఇది ఇంకా పూర్తి కాలేదు.దాని కాలు, చేయి, తల, ముఖంపై ఇంకా మరింత పని చేయాల్సి ఉంది.సాధారణ మానవుడు ఎలా నడుస్తాడో అదే విధంగా మేము దీన్ని రూపొందించడానికి ప్రయత్నించాము” అని వివరించాడు.ఈ రోబో మనుషులు కూర్చున్న రిక్షాను లాగుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ ప్రయోగం మరింత విజయవంతమై, కార్యరూపం దాల్చితే సిటీల్లో క్యాబ్‌లకు గట్టి పోటీ అవుతుందని అంతా భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube