అఖిల్ ఆశలన్నీ తాజాగా ఆయన నటించిన ఏజెంట్ సినిమా ( Agent Movie ) పైనే ఉన్నాయని చెప్పాలి.ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు సినిమాల్లో నటించిన అఖిల్ ( Akhil ) కి పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ అందించలేకపోయింది.
ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ఏజెంట్ సినిమా ద్వారా రాబోతున్నారు.ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇలా ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అఖిల్ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ… రెండేళ్ల ప్రయాణం ఈ ఏజెంట్ సినిమా.ఈ సినిమా ఎప్పటికీ తనకు గుర్తుంది పోతుందని తెలిపారు.ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని అఖిల్ తెలిపారు.ఈ సినిమా ప్రారంభం కాకముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఈ సినిమా కోసం నేను చాలా కష్ట పెడతాను.కష్టపడాలి అంటూ తనకు చెప్పారని అఖిల్ వెల్లడించారు.
ప్రస్తుతం అందరూ అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు మారిపోయారని అంటున్నారు అందుకు గల కారణం సురేందర్ రెడ్డి అని అఖిల్ తెలిపారు.

మామూలుగా జిమ్ కు వెళ్లి భారీగా కష్టపడి వర్కౌట్ చేస్తే ఎవరైనా కూడా శారీరకంగా మారిపోతారు.కానీ ఏజెంట్ సినిమా వల్ల నేను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా బలంగా మారిపోయాను.ఈ సినిమా నన్ను నా పరిధి దాటి కష్టపడేలా చేసింది.
ఏజెంట్ నా జీవితాన్నే మార్చేసిందని ఈ సందర్భంగా అఖిల్ వెల్లడించారు.ఇక ఈ సినిమాలో మలయాల నటుడు మమ్ముట్టి( Mammootty ) కూడా కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మమ్ముట్టి గారి పక్కన నటిస్తూ తాను ఎంతో స్ఫూర్తిని పొందానని అఖిల్ తెలియజేశారు.ఈ సినిమా ప్రయాణంలో తాను చాలా అలసిపోయానని అయితే ఆ అలసటలో కూడా తనకు చాలా తృప్తి ఉందని అఖిల్ ఏజెంట్ సినిమా గురించి వెల్లడించారు.






