ఏజెంట్ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అఖిల్ ఆశలన్నీ తాజాగా ఆయన నటించిన ఏజెంట్ సినిమా ( Agent Movie ) పైనే ఉన్నాయని చెప్పాలి.

ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు సినిమాల్లో నటించిన అఖిల్ ( Akhil ) కి పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ అందించలేకపోయింది.

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ఏజెంట్ సినిమా ద్వారా రాబోతున్నారు.

ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఇలా ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

"""/"/ ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అఖిల్ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.రెండేళ్ల ప్రయాణం ఈ ఏజెంట్ సినిమా.

ఈ సినిమా ఎప్పటికీ తనకు గుర్తుంది పోతుందని తెలిపారు.ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని అఖిల్ తెలిపారు.

ఈ సినిమా ప్రారంభం కాకముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఈ సినిమా కోసం నేను చాలా కష్ట పెడతాను.

కష్టపడాలి అంటూ తనకు చెప్పారని అఖిల్ వెల్లడించారు.ప్రస్తుతం అందరూ అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు మారిపోయారని అంటున్నారు అందుకు గల కారణం సురేందర్ రెడ్డి అని అఖిల్ తెలిపారు.

"""/"/ మామూలుగా జిమ్ కు వెళ్లి భారీగా కష్టపడి వర్కౌట్ చేస్తే ఎవరైనా కూడా శారీరకంగా మారిపోతారు.

కానీ ఏజెంట్ సినిమా వల్ల నేను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా బలంగా మారిపోయాను.

ఈ సినిమా నన్ను నా పరిధి దాటి కష్టపడేలా చేసింది.ఏజెంట్ నా జీవితాన్నే మార్చేసిందని ఈ సందర్భంగా అఖిల్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో మలయాల నటుడు మమ్ముట్టి( Mammootty ) కూడా కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మమ్ముట్టి గారి పక్కన నటిస్తూ తాను ఎంతో స్ఫూర్తిని పొందానని అఖిల్ తెలియజేశారు.

ఈ సినిమా ప్రయాణంలో తాను చాలా అలసిపోయానని అయితే ఆ అలసటలో కూడా తనకు చాలా తృప్తి ఉందని అఖిల్ ఏజెంట్ సినిమా గురించి వెల్లడించారు.