వీరూపాక్ష సెన్సార్ రివ్యూ...

మెగా మేనల్లుడు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ( Sai Dharam Tej ) వరస సినిమాలు చేస్తూ మంచి జోష్ లో ఉన్నాడు ఇక అందులో భాగం గానే సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్( Samyukta Menon ) జంటగా నటించిన చిత్రం విరూపాక్ష.( Virupaksha ) సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 Saidharam Tej Samyukta Menon Virupaksha Movie Censor Review Details, Sai Dharam-TeluguStop.com

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.థ్రిల్లర్‌గా రూపొందిన విరూపాక్ష.

ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్.

 Saidharam Tej Samyukta Menon Virupaksha Movie Censor Review Details, Sai Dharam-TeluguStop.com

మూవీ కంటెంట్‌పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించడంతో సక్సెస్ అయింది.అయితే, ఈ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.

సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్జారీ చేసినట్లుగా తెలుస్తుంది .

వాస్తవానికి తెలుగు సినిమాలకు ‘ ఏ’ సర్టిఫికెట్ జారీ చేయడం చాలా అరుదు.రీసెంట్‌గా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర చిత్రానికి కూడా ఇదే సర్టిఫికెట్ లభించింది.ఇప్పుడు సాయిధరమ్ ‘విరూపాక్ష’ మూవీకి కూడా A సర్టిఫికెట్ జారీ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ సహా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.మూవీ కంటెంట్‌పై టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.

యాక్సిడెంట్‌లో గాయపడి కోలుకున్న తర్వాత సాయిధరమ్ నుంచి వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ అంచనాలున్నాయి.

Telugu Karthikvarma, Sai Dharam Teja, Saidharamtej, Samyukta Menon, Sukumar, Vir

అలాగే తన కెరీర్‌కు కూడా సాలిడ్ హిట్ పడాల్సిన అవసరముంది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించింది తనే కావడం విశేషం.

ఇక ‘విరూపాక్ష’ తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు .ఇక విరూపాక్ష సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తుంది .సినిమా బాగుందని కొన్ని సన్నివేశాల వలన ఏ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పినట్టు సమాచారం.

Telugu Karthikvarma, Sai Dharam Teja, Saidharamtej, Samyukta Menon, Sukumar, Vir

థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా సినిమాను ప్రజెంట్ చేశారని .సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎస్సెట్ కాబోతోందని చెబుతున్నారు .సాయితేజ్, సంయుక్త మీనన్ పాత్రల్ని నీట్ గా పరిచయం చేశారు.సంయుక్తకు మంచి క్యారెక్టర్ దక్కిందని .సినిమా విజయం సాధిస్తుందని సెన్సారు సభ్యులు పేర్కొన్నట్టు సమాచారం .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube