బీజేపీకి వరుస షాకులు.. దేనికి సంకేతం !

కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తుండడంతో గెలుపు ఏ పార్టీని వరిస్తుందో అనేది హాట్ టాపిక్ గా మారింది.

 Shock For Bjp In Karnataka , Karnataka, Bjp, Congress, Jds Parties, Minister Is-TeluguStop.com

ఇదిలా ఉంచితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బావిస్తోంది.ఈసారి బీజేపీకి( BJP ) కర్నాటక గెలుపు చాలా అవసరం.

ఎందుకంటే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి.ఈ నేపథ్యంలో సౌత్ రాష్ట్రాలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కీలక పాత్ర వచించే అవకాశం ఉంది.

Telugu Congress, Jds, Karnataka, Iswaraiah, Shockbjp-Latest News - Telugu

అందువల్ల కన్నడ నాట మరోసారి కాషాయ జెండా ఎగురవేసి ఇతర సౌత్ రాష్ట్రాలపై ఫుల్ కాన్ఫిడెంట్ తో రంగంలోకి దిగాలని కమలనాథులు గట్టి ప్రణాళికలు వేస్తున్నారు.అయితే ప్రస్తుతం కన్నడ రాజకీయాలను పరిశీలిస్తే బీజేపీ ఆశలు అవిరయ్యేటట్లుగానే కనిపిస్తున్నాయి.ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడింది.అంతేకాకుండా సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు కూడా తగులుతున్నాయి.దాంతో మునిగిపోయే పడవలో ఉండేకన్నా ఇతర పడవలోకి షిఫ్ట్ కావడం మేలనే ఉద్దేశ్యంతో పలువురు బీజేపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్దమౌతున్నారనే టాక్ నడుస్తోంది.

Telugu Congress, Jds, Karnataka, Iswaraiah, Shockbjp-Latest News - Telugu

ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ మరియు, జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి.ఇక తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈశ్వరయ్య( Minister Iswaraiah ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.ఇది కమలం పార్టీకి మింగుడు పడని విషయమే.

ఇంకా మరికొంత మంది కూడా పార్టీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయట.మరోవైపు సర్వేలు కూడా బీజేపీకి ఈసారి అధికారం కష్టమే అనే సంకేతాలు ఇస్తున్నాయి.

దీంతో పార్టీ నేతల్లో కూడా ఎన్నికల్లో గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి బీజేపీకి కన్నడ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube