తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మంత్రి హరీశ్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని చెప్పారు.
హరీశ్ రావు ఏపీకి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తామని మంత్రి కారుమూరి తెలిపారు.వర్షం వస్తే హైదరాబాద్ లో ఇళ్లపైకి నీళ్లు వస్తాయన్నారు.
హరీశ్ రావు ముందు తెలంగాణ సంగతి చూసుకోవాలని వెల్లడించారు.ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణ స్కూళ్లు, ఏపీ స్కూళ్లకు తేడా గమనించాలన్నారు.జీడీపీలోనే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని తెలిపారు.