పవన్‌ ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే ఏ సినిమా షూట్‌ లో పాల్గొంటాడో తెలుసా?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఢిల్లీ పర్యటన లో ఉన్న విషయం తెలిసిందే.మూడు రోజుల పాటు అక్కడే పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వం లో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్( Ustad Bhagath Singh ) సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

 Pawan Kalyan Movies Shooting Update Details, Hari Hara Veeramallu, Pawan Kalyan,-TeluguStop.com

అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.హైదరాబాద్ శివారు ప్రాంతం లో ఈ సినిమా కోసం ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.

ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ని లెక్చరర్ పాత్ర లో చూడబోతున్నట్లుగా కూడా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.మొత్తానికి ఈ సినిమా చిత్రీకరణ కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 70 రోజుల డేట్లు ఇవ్వడం జరిగిందంట.ఆ 70 రోజుల్లో ఈ నెల లో 20 రోజుల డేట్లు పూర్తి కాబోతున్నాయి.

సినిమా ని ఇదే సంవత్సరం చివరి వరకు పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయం లో క్లారిటీ లేదు.

శ్రీ లీల పేరు ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు ఆ విషయమే అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.పవన్ కళ్యాణ్ ఈ సినిమా మాత్రమే కాకుండా హరిహర వీరమల్లు ఇంకా మరో రెండు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలు మరియు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు.

ఢిల్లీ పర్యటనలో బిజెపి నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.మరో వైపు ఏపీ రాజకీయాల్లో పట్టు కోసం త్వరలోనే యాత్ర నిర్వహించేందుకు కూడా పవన్‌ ఏర్పాట్లు చేస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube