పర్మిషన్ లేని ప్రయివేట్ హాస్పిటల్ సీజ్ చేయాలి! సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎరవెల్లి నాగరాజురాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో పుట్టగొడుగుల పుట్టుకస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరం, చిన్న చిన్న సమస్యలతో ప్రవేట్ హాస్పిటల్ కి వస్తే టెస్టుల పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారనీ, అమాయక ప్రజల దగ్గర నుండి స్కానింగ్ సెంటర్ లు స్కానింగ్ పేరుతో ఆద్దులు అదుపు లేకుండా వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారన్నారు.
వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.డిఎంహెచ్ఓ పర్యవేక్షణలోపం ఉందనీ, స్వయంగా మంత్రి కేటీఆర్ ఆరోగ్య అధికారులు ప్రోత్సహించడం శోచనీయంగా ఉందన్నారు.
జిల్లాలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో 500 నుంచి 600 ఓపి వస్తుండగా నామమాత్రంగా వైద్యం అందిస్తున్నారు.ఇంకా కూడా సిబ్బంది డాక్టర్ల కొరత ఉందనీ, వేములవాడ ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు సిబ్బంది కోరత ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉండడంవల్ల సమయానికి రాకపోవడం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను వారి హాస్పిటల్ కి రప్పించుకోవడం జరుగుతుందనీ వెంటనే వారి పైన చర్యలు కూడా తీసుకోవాలనీ ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది డాక్టర్ లను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్, నాయకులు మహ్మద్ అక్రం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.