ప్రజావాణి కార్యక్రమం( Prajavani Program )లో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) ఆదేశించారు.సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు బి.
సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు.ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు.కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 23 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని అందులో రెవెన్యూ – 6, ఎల్ డి ఎం – 1,ఎంసీ సిరిసిల్ల – 3,నర్సింగ్ కాలేజీ – 1 ఎంపీడీఓ తంగళ్ళపల్లి – 1, డీసీఒ – 2,ఎంసీ వేములవాడ – 1,ఎస్ పి ఆఫీస్ – 1,ఎస్సి కార్పొరేషన్ – 1,సివిల్ సప్లై మేనేజర్ – 1,డీపీవో – 3,ఆర్ &బి – 1,సెస్ – 1 స్వీకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.