భారతదేశంలో మొట్టమొదటి ప్రోటో టైప్ 3D ప్రింటెడ్ బ్రిడ్జ్ ను సింప్లిఫోర్జ్ క్రియేషన్స్( Simpliforge Creations ) సహకారంతో ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది.ఐఐటి హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ప్రొఫెసర్ కె.
వి.ఎల్ సుబ్రహ్మణ్యం( KVL Subrahmanyam ), పరిశోధన బృందంతో కలిసి ఈ వంతెన రూపకల్పన చేశారు.పాదాచారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది.మెటీరియల్ ఫాలోస్ ఫోర్స్ పద్ధతి ద్వారా ఈ బ్రిడ్జ్ రూపొందించారు.ఎక్స్ ట్రూషన్ మరియు సాఫ్ట్వేర్ సిస్టంను సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.ఇంకా ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ 3d ప్రింటర్ ని ఉపయోగించి సింప్లిఫోర్జ్ ప్రింటింగ్ ఫెసిలిటీలో రెండు గంటల సమయంలో ఈ వంతెన అఫ్- సైట్ ప్రింట్ చేసి సిద్దిపేటలోని చార్విత మెడోస్ లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ వంతెన నిర్మాణం గురించి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వాడకం తో తక్కువ వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తక్కువ వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేసే సామర్థ్యం ఒక్క 3D కాంట్రాక్ట్ టెక్నాలజీకే చెందుతుందని తెలిపారు.నిర్మాణ రంగంలో ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఎన్నో మార్పులు తెస్తుందని తెలిపారు.
ఈ 3D టెక్నాలజీతో మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలను డిజైన్ చేసుకోవచ్చు.ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుని నిలబడే సామర్థ్యం 3d టెక్నాలజీలో ఉందన్నారు.
సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి( Harikrishna Zeedipalli ) మాట్లాడుతూ.తాను ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అంతే కాకుండా పరిశ్రమలలో, మౌలిక సదుపాయాలలో ఈ 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ చూసే వారందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు.