సూర్యాపేట మున్సిపాలిటీలో నకిలీ ట్రేడ్ లైసెన్సులు కలకలం సృష్టించాయి.మున్సిపల్ కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో వీధి వ్యాపారులకు ఫేక్ ట్రేడ్ అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఓ వీధి వ్యాపారి ఫిర్యాదుతో నకిలీ బాగోతం బయటపడింది.దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఫేక్ ట్రేడ్ లైసెన్సుల వ్యవహారంపై విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా 2016 వ సంవత్సరం నుంచి నకిలీ ట్రేడ్ లైసెన్స్ నడుస్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది.అనంతరం దీనికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.