నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది.ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.
మదర్ టైగర్ కోసం అటవీశాఖ అధికారులు పడిన శ్రమ వృధా అయింది.ఈ క్రమంలోనే ముసమడుగు సమీపంలోని అడవిలోకి పులికూనలను తరలించారు అధికారులు.92 గంటలు గడిచినా పిల్లల దగ్గరకు తల్లిపులి రాలేదు.పులి కూనలను తిరిగి ఆత్మకూరు క్యాంప్ కార్యాలయానికి తరలించారు.