బాలయ్య మూవీలో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.ఈయన కెరీర్ లోనే ప్రెజెంట్ దూసుకు పోతున్నాడు.

 Nora Fatehi In Balayya Nbk108 Movie, Nbk108, Balakrishna, Anil Ravipudi, Nora Fa-TeluguStop.com

అఖండ ముందు వరకు వరుసగా ప్లాప్స్ అందుకుని బాలయ్య రేసులో వెనుక బడ్డారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ వెంటవెంటనే పడడంతో బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

బాలయ్య ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి బాలయ్యతో ఎలాంటి కథను తెరకెక్కించ బోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

సెకండ్ షెడ్యూల్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ నెలలోనే స్టార్ట్ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొక కీ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీను తీసుకోవాలని అనుకుంటున్నారట.ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి అని తెలుస్తుంది.ఇది నెగిటివ్ రోల్ అని నోరా ఫతేహి అయితేనే సరైన న్యాయం జరుగుతుంది అని అనిల్ అనుకుంటున్నారట.

మరి బాలయ్య, నోరా ఫతేహి మధ్య సీన్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.అందుకే బాలయ్య డైలాగ్స్ కూడా తెలంగాణ యాసలోనే ఉండనున్నాయట.బాలయ్య 60 ఏళ్ల వ్యక్తిగా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్.ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది.అలాగే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube