డబుల్ బెడ్ రూం అవకతవకలపై కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

నల్లగొండ జిల్లా:నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇండ్లు మంజూరు చేయించుకొని నిరుపేద లబ్ధిదారులకు అన్యాయం చేశారని,ఇది చాలదన్నట్లు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి వందల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు.

 Bjp Dharna In Front Of Collectorate On Double Bedroom Room Irregularities, Bedro-TeluguStop.com

నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత లేకుండా వ్యవహరించారని,అర్హులను పక్కన పార్టీ కార్యకర్తలకు ఇల్లులు ఇచ్చుకున్నారని,దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపి,ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,మోరిశెట్టి నాగేశ్వర్ రావు,వీరెల్లి చంద్రశేఖర్,కర్నాటి సురేష్ కుమార్,నాగం వర్షిత్త్ రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డీ, జిల్లా ఉపాధ్యక్షులు దాశోజు యాదగిరాచారి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్,ఆవుల మధు, కొండేటి సరిత,రావెళ్ళ కాషమ్మ,నేవర్శు నీరజ, వివిధ మోర్చల పదాధికరులు,ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube